సైరా సినిమా సెట్ లో గొడవ జరిగిందా.. చరణ్ సీరియస్ గా ఉన్నాడా..

ఏమో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకో తెలియదు కానీ రామ్ చరణ్ మాత్రం ఇప్పుడు సైరా షూటింగ్ జరుగుతున్న తీరుపై అసంతృప్తిగా ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమా 2019 ఏప్రిల్లో విడుదల అవుతుందని రామ్ చరణ్ ఎప్పుడో చెప్పాడు. గతేడాది ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా సమ్మర్ లో సినిమా వస్తుంది పండగ చేసుకోండి అంటూ చెప్పాడు. అప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయిందని క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్. కానీ ఇప్పటి వరకు ఈ చిత్ర షూటింగ్ కేవలం 60 శాతం మాత్రమే పూర్తయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. పర్ఫెక్షన్ పేరు చెప్పి సురేందర్ రెడ్డి మళ్లీ మళ్లీ అవే సీన్లు తీస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై రామ్ చరణ్ కాస్త సీరియస్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది.

Sye Raa Narasimha Reddy
బడ్జెట్ తో పాటు టైం కూడా ఎక్కువ కావడంతో చరణ్ లో అసహనం పెరిగిపోయింది. ఎంతైనా నిర్మాత కదా ఆ మాత్రం కోపం ఉండటం సహజం అంటున్నారు విశ్లేషకులు. ఒకటి రెండు కోట్ల సినిమా అయితే ఏమో అనుకోవచ్చు కానీ ఏకంగా 200 కోట్లు పెట్టి తీస్తున్న సినిమా కావడంతో లేట్ అవుతున్న నిర్మాతల టెన్షన్ కూడా పెరిగిపోతుంది. ఇదే విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డితో రామ్ చరణ్ కాస్త సీరియస్ గా మాట్లాడాడని.. సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలి అంటూ వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. దసరా వరకు సైరా సినిమా విడుదలయ్యేలా చూడాలని ఆ దర్శకున్ని.. ఈ నిర్మాత కోరాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి సురేందర్ రెడ్డి ఈ సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేస్తాడో లేదో చూడాలి. అన్నీ కుదిరితే దసరాకు సైరా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. కానీ అది సాధ్యమవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here