మెగాస్టార్ తో చిందులేసిన సన్నీలియోన్..

మెగాస్టార్ అంటే మన చిరంజీవి కాదు.. మలయాళ ఇండస్ట్రీలో కూడా ఒక మెగాస్టార్ ఉన్నాడు. అక్కడ మమ్ముట్టిని మెగాస్టార్ అంటారు. ఇప్పుడు ఈయనతో కలిసి సన్నీ లియోన్ నటించింది. ప్రస్తుతం మధుర రాజా సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు మమ్ముట్టి. తెలుగులో కూడా యాత్ర సినిమాలో నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిపోయింది.. సెన్సార్ కూడా కంప్లీట్ అయింది.

క్లీన్ యు సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాత్ర సినిమా తర్వాత కేరళ వెళ్లిపోయి మళ్లీ అక్కడి సినిమాలతో బిజీ అయిపోయాడు మమ్ముట్టి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మధుర రాజా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయిపోయింది. 2010లో వచ్చిన పోకిరి రాజా సినిమా సీక్వెల్ ఇది. ఇందులో సన్నీలియోన్ తో కలిసి ఒక పాటలో చిందేసాడు మమ్ముట్టి. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ కేరళలోనే జరుగుతుంది.

ఈ సందర్భంగా తీసిన ఒక ఫోటో నెట్ లో వైరల్ గా మారిపోయింది. మెగాస్టార్ తో సన్నీలియోన్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు తమిళ కన్నడ హిందీ అన్ని భాషల్లోనూ నటిస్తుంది సన్నీ లియోన్. ప్రస్తుతం తెలుగులో ఈమె నటిస్తున్న వీర మహాదేవి షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. శృంగార తార ఇండియన్ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

sunny leone heating to red

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here